అనురాగ్ కశ్యప్ కు ఆర్జీవీ సపోర్ట్ ..

అనురాగ్ కశ్యప్ కు ఆర్జీవీ సపోర్ట్ ..

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి డిమాండ్ చేస్తున్నారు. నటి కంగనా రనౌత్ కూడా పాయల్ ఘోష్ కి మద్ధతు తెలుపుతూ 'మీ టూ' 'అరెస్ట్ అనురాగ్ కశ్యప్' అంటూ ట్వీట్ పెట్టింది. అయితే ఇండస్ట్రీలోని మరికొందరు మాత్రం అనురాగ్ కశ్యప్ కి సపోర్ట్ నిలుస్తున్నారు.ఇప్పటికే హీరోయిన్ రాధికా ఆప్టే అనురాగ్ కుమద్దతు తెలుపగా ఆతర్వాత తాప్సి మాట్లాడుతూ అనురాగ్ కశ్యప్ పై ఆ రోపణలు నిజం కాదని నేను భావిస్తున్నాను అంది. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అనురాగ్ కు మద్దతుగా ట్వీట్ చేసారు. "అనురాగ్ కశ్యప్ ను నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన చాలా సున్నిత మనస్కుడు. ఎవరిని కూడా బాధపెట్టే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని బాధ పెట్టిన సందర్బాలు లేవు." అంటూ వర్మ రాసుకొచ్చారు.