లక్ష్మీస్ ఎన్టీఆర్ షోకు జగన్‌కు ఆహ్వానం !

లక్ష్మీస్ ఎన్టీఆర్ షోకు జగన్‌కు ఆహ్వానం !

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు.  నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఈరోజు తిరుపతికి వెళ్లారు.  శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మే 31న చిత్రం విడుదలవుతుందని అన్నారు.  అలాగే రేపు 30వ తేదీన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా వెళ్లి స్పెషల్ షోకు ఆహ్వానిస్తానని అన్నారు.  మరి సిఎంగా భాధ్యతలు తీసుకుని బిజీగా ఉండనున్న జగన్ వర్మ ఆహ్వానాన్ని మన్నిస్తారో లేదో చూడాలి.