ఆఫీసర్ ట్రైలర్ టాక్ 

ఆఫీసర్ ట్రైలర్ టాక్ 

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున తాజాగా నటించిన చిత్రం "ఆఫీసర్". ఇదివరకే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టారు. మే 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఇవాళే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దామా. 

 ట్రైలర్ మొత్తం రామ్ గోపాల్ వర్మ శైలిలోనే..యాక్షన్ ఎలెమెంట్స్ తో ఉంది. నాగార్జున..అసలు భయం లేని పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. సినిమా ప్లాట్ చూస్తే ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే దిశగా నడుస్తున్నట్లుగా ఉంది. ఇందులో తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమను చూపించేలా కూడా ఓ ట్రాక్ నడవనుంది. డార్క్ థీమ్ లో నడిచే పోలీస్ డ్రామాగా..రెగ్యులర్ పోలీస్ స్టోరీలకు భిన్నంగా మాత్రం ఉంటుందని ఈ ట్రైలర్ చెప్పింది. కెమెరా పనితనం ప్రేక్షకుడిని ఆ మూడ్ లోకి తీసుకెళ్లేలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ తన సొంత బ్యానర్ కంపెనీ బ్యానర్ పై నిర్మించాడు.