అమిత్ షా సార్ దండం పెట్టి అడుగుతున్నా సుశాంత్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించండి :రియా

 అమిత్ షా సార్ దండం పెట్టి అడుగుతున్నా సుశాంత్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించండి :రియా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యతో బాలీవుడ్ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడి రేగింది. సుశాంత్ ఆత్మహత్యకు పరిశ్రమలోని బంధు ప్రీతే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. బైకాట్ బాలీవుడ్ అంటూ పోస్ట్ లు పెట్టారు. అంతే కాకుండా బాలీవుడ్ లో వారసత్వంగా ఎంట్రీ ఇచ్చిన వారిపై ట్రోల్స్ చేసారు. మరో వైపు కంగనా రనౌత్ తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం యే కారణమని బహిర్గతంగా చెప్పారు. అంతేకాకుండా సుశాంత్ ఇండస్ట్రీలోని కొందరు పెద్దల ఒత్తిడి వల్లే చనిపోయాడని కోర్ట్ లో కేసులు సైతం వేశారు.  సుశాంత్ మృతి పై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం పోలీసులు ఈ దిశగా విచారణ జరుపుతున్నారు. దాంతో పోలీసులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఇండస్ట్రీలోని మరి కొందరిని విచారించారు. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని నిర్దారణ అయ్యింది. ఇక ఇప్పుడు తాజాగా సుశాంత్ మృతిపై సీబీఐ విచారణను ప్రారంభించాలని ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి బీజేపీ నేత అమిత్ షా ను కోరింది. "సుశాంత్ మరణించి 2నెలలు గడిచింది. అమిత్ షా సార్ నాకు ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం  ఉంది. సుశాంత్ మృతిపై వీలైనంత త్వరగా సీబీఐ విచారణను ప్రారంభించండి. రెండు చేతులు జోడించి అడుగుతున్నా" అంటూ రియా ట్వీట్ చేసింది.