తల్లి కాబోతున్న మిర్చి బ్యూటీ...

తల్లి కాబోతున్న మిర్చి బ్యూటీ...

రిచా గంగోపాధ్యాయ.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. 2010లో 'లీడర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత 'మిర్చి, మిరపకాయ్, భాయ్' లాంటి సినిమాలు చేసింది. ఈ బ్యూటీ మిర్చి మూవీతో మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత చదువులంటూ సడెన్‌గా సినిమాలు మానేసి, యూఎస్‌ వెళ్లిపోయింది. రెండేళ్ల కింద అమెరికా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సోషల్‌ మీడియాకు కూడా దూరమైపోయింది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రిచా తల్లి కాబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా రిచానే చెప్పింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. జో, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ జూన్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ వెల్లడించింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమెకు నెటిజన్లు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.