రికీ పాంటింగ్‌కు కీలక బాధ్యతలు

రికీ పాంటింగ్‌కు కీలక బాధ్యతలు

లెజెండరీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌కు 'క్రికెట్‌ ఆస్ట్రేలియా' కీలక బాధ్యతలు అప్పగించింది. వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆసీస్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్‌ను నియమించింది. ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో కలిసి పాంటింగ్‌ పనిచేస్తాడు. 2017, 2018ల్లోనూ ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్‌ పనిచేశాడు. మొత్తం ఐదు వరల్డ్‌కప్‌లు ఆడిన పాంటింగ్‌.. అందులో వరల్డ్‌కప్‌లకు కెప్టెన్‌గా వ్యవాహరించాడు. 
తనక బాధ్యతలు అప్పగించడంపై రికీ హర్షం వ్యక్తం చేశాడు. గతంలో వన్డే, టీ20 జట్లకు షార్ట్‌ టర్మ్‌లో పనిచేశానని చెప్పిన పాంటింగ్‌.. తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలను అప్పగించినందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు థ్యాంక్స్‌ చెప్పాడు.