రిషబ్ పంత్ మెరుపులు.. ధోనీ రికార్డు బద్దలు..

రిషబ్ పంత్ మెరుపులు.. ధోనీ రికార్డు బద్దలు..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రిషబ్.. మిస్టర్ కూల్, భారత మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు రిషబ్ పంత్. కాగా, గతంలో ధోనీ పేరిట 2017లో బెంగళూరులో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ధోనీ 56 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇక, సెంచూరియన్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీ(52)తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నది కూడా ధోనీయే.. వెండీస్ టూర్‌లో రెండు టీ-20లో పెద్దగా రాణించలేకపోయినా.. మూడో టీ-20లో రాణించడమే కాదు.. ధోనీ రికార్డును బ్రేక్ చేశారు పంత్. మరోవైపు మూడు టీ-20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది టీమిండియా.