సెంచరీ పూర్తి చేసి ఔట్ అయిన పంత్... 

సెంచరీ పూర్తి చేసి ఔట్ అయిన పంత్... 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత వికెట్ కీపర్ పంత్ తన శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే పంత్ కు ఇది టెస్టులో మూడో సెంచరీ కాగా ఇండియాలో మాత్రం మొదటిది. అయితే శతకం పూర్తి చేరిన పంత్ దానికి మరొక్క పరుగు జోడించి పెవిలియ చేరుకున్నాడు. పంత్ శతకంతో టీం ఇండియా ప్రస్తుతం  259/7 తో నిలిచింది. ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ పై 54 పరుగుల ఆధిక్యం సాధించింది టీం ఇండియా. పంత్ ఔట్ కావడంతో బ్యాటింగ్ చేయడానికి అక్షర్ పటేల్ వచ్చాడు. అయితే ఈరోజు మ్యాచ్ ముగియడానికి ఇంకా 17 ఓవర్లు మిగిలి ఉన్నాయి. చూడాలి మరి భారత్ ఇంకా ఎన్ని పరుగుల ఆధిక్యం సాధిస్తుంది అనేది. ఇక నిన్న బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 205 పరుగులకే ఆల్ ఔట్ అయిన విషయం తెలిసిందే.