నన్ను ధోనితో పోల్చొద్దు : పంత్
రిషభ్ పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అయితే ఈ సిరీస్ ముగించుకొని వచ్చిన భారత జట్టుకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. అయితే టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్‌ను మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీతో పోలుస్తున్నారు. అయితే చివరి బ్రిస్బేన్ టెస్ట్‌లో ధోనీ రికార్డును కూడా పంత్ బ్రేక్ చేయడంతో.. ఈ పోలిక మరింత ఎక్కువైంది. అయితే పంత్ మాత్రం తనను ధోనీతో పోల్చొద్దని కోరాడు. 'ధోనీతో పోలుస్తుంటే.. బాగుంటుంది. కానీ నన్ను ఎవరితోనూ పోల్చడం నాకు ఇష్టం ఉండదు. ఇండియన్ క్రికెట్లో నాకంటూ ప్రత్యేకంగా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడంతో జట్టు మొత్తం సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను' అని రిషబ్ పంత్ తెలిపాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)