నేను ఫామ్ లో లేకపోయినా ఛాన్స్ ఇచ్చారు : పంత్

నేను ఫామ్ లో లేకపోయినా ఛాన్స్ ఇచ్చారు : పంత్

ఆసీస్ సిరీస్ లో గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన రిషభ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. ధీ పై పంత్ స్పందిస్తూ... ఈ మ్యాచ్ ముందు నేను బాగా ఆడకున్నా సపోర్ట్ స్టాఫ్, సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఆ ప్రోత్సాహంతోనే నేను రాణించగలిగాను. ఇది ఓ డ్రీమ్ సిరీస్. వాస్తవానికి టీమ్‌మేనేజ్‌మెంట్ ఎప్పుడూ నాకు అండగా ఉంది. నేను కూడా ప్రతీ రోజు భారత్‌కు విజయాన్నందించాలని ఆలోచించేవాడిని. అది ఈ రోజు జరిగింది. ఆటలో ఐదో రోజు బంతి టర్న్ అయింది. దాంతో నా షాట్ సెలెక్షన్‌లో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నాను'అని పంత్ చెప్పుకొచ్చాడు. అయితే 1988 తర్వాత బ్రిస్బేన్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఓడని ఆస్ట్రేలియాకు టీమిండియా ఓటమి రుచి చూపించింది.