పంత్‌.. ధోనిని అనుసరించొద్దు

పంత్‌.. ధోనిని అనుసరించొద్దు

వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ కీపింగ్ లో మహేంద్రసింగ్ ధోనీని అనుసరించొద్దు అని భారత మాజీ వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి సూచించారు. తాజాగా సయ్యద్‌ కిర్మాణి ఇంగ్లాండ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ గురించి స్పదించారు. అరంగేట్ర టెస్టులో పంత్ బైస్ రూపంలో చాలా పరుగులు సమర్పించుకున్నాడు. పంత్ కీపింగ్ లో బేసిక్స్ చాలానే నేర్చుకోవాలన్నారు. వికెట్ల వెనకాల కీపర్ ఎంత అవసరమో ధోని నిరూపించారు. యువత ధోని ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. ధోని ఒక అరుదైన వికెట్‌ కీపర్‌ అని కిర్మాణి పేర్కొన్నారు.

వికెట్‌ కీపింగ్‌లో బేసిక్స్ చాలా అవసరం. బ్యాటింగ్‌లో పంత్‌ బాగానే ఆడుతున్నాడు. కీపింగ్ లో మాత్రం తప్పులను చేస్తున్నాడని కిర్మాణి అన్నారు. కీపింగ్‌లో బంతులు అందుకునేందుకు టెక్నిక్‌ అవసరం. స్పిన్‌ బౌలింగ్‌లో బౌలర్‌ వేసిన బంతి టర్న్‌ తీసుకొనే వరకు కూర్చొని ఉండాలి. బంతి పిచ్‌ అయిన తర్వాత దాని గమనాన్ని బట్టి వికెట్ల వెనుక కదలాలి. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్‌ ఎప్పుడు లేస్తున్నాడన్న దానిపైనే అతడి సామర్థ్యం తెలుస్తుంది. అయితే పేసర్ల బౌలింగ్‌లో కీపర్ కుదురుకోవడానికి చాలానే సమయం ఉంటుంది అని కిర్మాణీ తెలిపారు. ఫీల్డర్లు బంతిని విసిరే సమయంలో ధోని వికెట్ల ముందు నిలబడి బంతిని అందుకుంటాడు. ధోనీలో అది ఒక ప్రత్యేకత. పంత్‌ కూడా అలానే బంతిని అందుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. అది టెక్నిక్ కాదు.. అలా అనుసరించొద్దు అని సూచించారు. వికెట్ల వెనకాల ఉండి బంతిని అందుకోవడంమే పద్ధతి. బంతి ఎక్కడ పిచ్‌ అవుతుందో తెలుసుకుని దానికి తగ్గట్టు కదలాలి అని కిర్మాణి సూచించాడు.