రివ్యూ : "సవ్యసాచి"

రివ్యూ : "సవ్యసాచి"

 

 

నటీనటులు : అక్కినేని నాగచైతన్య, నిధిఅగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్ తదితరులు 

సంగీతం : కీరవాణి 

ఫోటోగ్రఫి : యువరాజ్ 

నిర్మాతలు : నవీన్ యర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి

దర్శకత్వం : చందు మొండేటి

రిలీజ్ డేట్ : 02-11-2018

నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  మాస్ కు దగ్గరయ్యేందుకు చైతు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయా లేదా అన్నది ఈ సినిమాతో తేలిపోతుంది.  వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే కొత్త కథతో చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో ఇప్పుడు చూద్దాం.  

కథ: 

నాగ  చైతన్య ఒక యాడ్ మేకర్.  కాలేజీలో ఉండగా నిధి అగర్వాల్ ను ప్రేమిస్తాడు.  అనుకోకుండా ఆమెకు దూరం అవుతాడు.  ఆరేళ్ళ తరువాత తిరిగి కలుసుకున్న చైతు.. ఆమెతో ప్రేమలో మునిగిపోవాలి అనుకునే సమయంలో.. సడెన్ గా అక్క  భూమిక ఇంట్లో బాంబు పేలుతుంది.  ఆ దుర్ఘటనలో బావ చనిపోగా.. అక్క కూతురు కిడ్నాప్ అవుతుంది.  ఆ బాంబును ఎవరు పేల్చారు.  ఎందుకు పేల్చారు.  అక్క కూతురును ఎందుకు.. ఎవరు కిడ్నాప్ చేశారు..? అసలు ఈ కథలో మాధవన్ ఎవరు..? అన్నది మిగతా కథ. 

విశ్లేషణ : 

కథ కొత్తగా ఉండటంతో... సినిమాపై ఆసక్తి పెరిగింది.  ఇందుకు తగ్గట్టుగానే  వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ లక్షణాలను, దాని వలన తలెత్తే సమస్యల గురించి చర్చిస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది .  సినిమా ఓపెనింగ్ ఎంతటి ఆసక్తిగా ఉంటుందో .. దానిని కంటిన్యూగా చూపించడంతో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.  ఇదే సినిమాకు మైనస్ గా మారింది.  ఒక్కరిలో ఇద్దరు ఉన్నారు అన్న కొత్త పాయింట్ మినహా మిగతా కొత్తగా ఏమిలేదు.  పాత్రలను పరిచయం చేయడం, కాలేజీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది.  చైతన్య, వెన్నెల కిషోర్ చేసిన సందడి పర్వాలేదనిపించింది.  

సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది.  బాంబు పేలుడు తరువాత సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అక్క కూతురు కిడ్నాప్ అంశాలను ఛేదించే క్రమంలో విలన్ కు, హీరోకు మధ్య మైండ్ గేమ్ తరహా కథనం మొదలౌతుంది. ఇదే సినిమాకు ప్లస్ పాయింట్.  సెకండ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.  మాధవన్ పాత్ర వెండితెరకు పరిచయం, వ్యానిషింగ్ సిండ్రోమ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 

నటీనటుల పనితీరు : 

హీరో నాగ చైతన్య, విలన్ రోల్ చేసిన మాధవన్ పాత్రలు ఆకట్టుకుంటాయి.  నిధి అగర్వాల్ తెరపై అందంగా కనిపించింది.  భూమిక చిన్న పాత్రే అయినప్పటికీ ఆకట్టుకుంది.  వెన్నెల కిషోర్, సత్య, శంకర్ పాత్రలు మెప్పించే ప్రయత్నం చేశారు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం ఆకట్టుకుంది. కొత్త కథతో మెప్పించే ప్రయత్నం చేశాడు. కీరవాణి సంగీతం సినిమాపై మంచి ప్రభావం చూపింది.  యువరాజ్ కెమెరా ఆకట్టుకుంది.  సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.  

ప్లస్ పాయింట్స్ : 

కథ 

కథనం 

నటీనటులు 

క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్ : 

ఫస్ట్ హాఫ్ 

చివరిగా : సవ్యసాచి ప్రయత్నం కొంతవరకు ఫలించింది.