ఎన్డీఏపై తేజస్వీ యాదవ్ సైకిల్ పోరు

ఎన్డీఏపై తేజస్వీ యాదవ్ సైకిల్ పోరు

ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాష్ట్రంలోని అధికార ఎన్డీఏ కూటమిపై సమరభేరి మోగించారు. బోధగయ నుంచి రాజధాని పాట్నాకి సైకిల్ యాత్ర ప్రారంభించారు. 5 వేల మంది యువకులతో కలిసి బోధగయ నుంచి ‘ఎన్డీఏని తరిమి కొట్టండి-ఆడపిల్లలను కాపాడండి సైకిల్ యాత్ర‘లో తేజస్వి సైకిల్ తొక్కారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. బీజేపీ, జేడీయూల డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రతి రంగంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. నేరగాళ్లకు అధికార పార్టీ రక్షణ ఇస్తోందని విమర్శించారు. ముజఫర్ పూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తామిచ్చిన తీర్పుని అపహాస్యం చేస్తూ అధికార పీఠంపై కూర్చున్నవారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఈ యాత్రలో ఓటర్లని కోరనున్నట్టు తేజస్వి చెప్పారు.