సీఎంను కలిసిన రోజా.. 10 నిమిషాల్లో ముగిసిన భేటీ..!

సీఎంను కలిసిన రోజా.. 10 నిమిషాల్లో ముగిసిన భేటీ..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ కలిశారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన రోజా.. దాదాపు పది నిమిషాలపాటు జగన్‌తో మాట్లాడారు. తనకు ఎలాంటి పదవులూ వద్దని జగన్‌లో రోజా చెప్పినట్టు తెలిసింది. జగన్‌ను కలిసే ముందు పార్టీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డితో రోజా సమావేశమయ్యారు. దాదాపు అరగంటపాటు ఆయనతో మాట్లాడిన రోజా.. తనకు జరిగిన అన్యాయంపై వివరించినట్టు తెలిసింది.