జగన్‌తో భేటీ తర్వాత రోజా ఏమన్నారంటే..

జగన్‌తో భేటీ తర్వాత రోజా ఏమన్నారంటే..

మంత్రి పదవి దక్కనందుకు తనకు ఎటువంటి అసంతృప్తీ లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను ఇవాళ ఆమె కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా పదేళ్లు కష్టపడ్డామని.. తమకు పదవుల కోసం కాదని అన్నారు. అలగడాలు.. బుజ్జగించడాలు వంటివి లేనేలేవని.. అటువంటి తప్పుడు కథనాలతో తమ మధ్య దూరం పెంచవద్దని కోరారు. మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తికి లోనయ్యానంటూ వచ్చిన కథనాలను చూసి తానూ బాధపడ్డానని చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రైతే తామంతా ముఖ్యమంత్రి అయినట్టేనని చెప్పిన రోజా.. తమ నియోజకవర్గ ప్రజలకు 'నవరత్నాలు' అందేలా చూస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశానని రోజా చెప్పారు.