రోడ్డు ప్రమాదంలో 27 మంది సజీవ దహనం

రోడ్డు ప్రమాదంలో 27 మంది సజీవ దహనం

ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. బలూచిస్థాన్‌లో ఇంధనం నింపుకొని వెళ్తున్న ఓ ట్రక్కు.. కరాచీ నుంచి పంజ్‌గురుకు వస్తున్న బస్సును లాస్బెల జిల్లాలో బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను కరాచీకి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.