అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి

అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి

అమెరికాలో నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డుప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. బొంగుల సాయినాథ్ రెడ్డి రోడ్డు పై నడుచుకుంటు వెళుతున్న సమయంలో గుర్తుతెలియని కారు ఢీకొనడంతో చనిపోయాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన సాయినాథ్ ఉద్యోగ ప్రయత్నాల్లో బయటికి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కొంతకాలం క్రితమే సాయినాథ్ ఎమ్మెస్ పూర్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లారు. సాహిత్‌ రెడ్డి తల్లిదండ్రులు మధుసూదన్‌ రెడ్డి, లక్ష్మీ నల్లకుంటలోని పద్మా కాలనీలో నివాసం ఉంటున్నారు. తమ పెద్ద కుమారుడి మృతితో కుటుంబసభ్యులు తీరని దుఃఖంలో మునిగిపోయారు.