బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం...

బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం...
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్.12లో నిన్న అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న స్కూటీ సహా పక్కనే నిలిపి ఉన్న క్యాబ్‌ను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది కారు. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణం అయిన వ్యక్తి.. కారును అక్కడే వదిలివెళ్లాడు. పోలీసులు నంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు కనుక్కొని కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టోలీచౌకీకి చెందిన అబ్తాబ్‌గా గుర్తించారు.