బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి...
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు . మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో... ట్రక్కును ఢీకొట్టింది. కటిహర్ జిల్లాలోని కుర్షేలా సమీపంలో 31 వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 10 మందితో కూడిన బ్యాండ్ బృందం ఆటోలో పూర్నియా నుంచి ఆటోలో బయలుదేరినట్టు పోలీసులు తెలిపారు. ఆటో కుర్షేలా సమీపంలోని 31 వ జాతీయ రహదారిపైకి చేరుకున్నాక ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక తీవ్రంగా గాయపడిన నలుగురికి చికిత్స అందిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)