చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి 

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి 

ప్రపంచంలో అత్యధికం మంది రోడ్డు ప్రమాదాల వలనే మరణిస్తున్నారు.  డ్రైవింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్చంద సేవ సంస్థలు నిత్యం హెచ్చరికలు చేస్తున్నా తీరు మారడం లేదు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.  ఇదిలా ఉంటె రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బోర్ వెల్ ను ఢీకొన్నది.  ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఐదుగురు మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నది.  చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది.  ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.