ఆటోను ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి

ఆటోను ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. తమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.