నల్గొండ జిల్లాలో బస్సు బోల్తా...

నల్గొండ జిల్లాలో బస్సు బోల్తా...

నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.... జిల్లాలోని వేములపల్లిలో రాత్రి గాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా... మరో 15 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి ఒంగోలు వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అనంతరం డ్రైవర్ పరారయ్యాడు.