వరంగ్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

వరంగ్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలో జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి... ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు అధికారులు.. ఈ ప్రమాద సమయంలో బస్సుల్లో ఉన్న సుమారు 25 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్టుగె తెలుస్తుండగా.. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని సమచారం. ఓ బస్సు వరంగ్‌ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా.. మరో బస్సు నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తుందని తెలుస్తోంది. అయితే, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాల్సి ఉంది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ వైఫల్యమా? అనేది తేల్చేపనిలో పడిపోయారు అధికారులు.