రోడ్డు ప్రమాదంలో మామ, మేనకోడళ్లు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మామ, మేనకోడళ్లు దుర్మరణం

వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మామ, మేనకోడళ్లు దుర్మరణం చెందారు. చెన్నరావుపేట మండలం జెల్లి గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ గీసుకొండ మండలం పోతురాజుపల్లిలోని తన అక్క కుమార్తెలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు. ముగ్గురు మేనకోడళ్లను తీసుకుని బైక్ పై స్వగ్రామానికి తీసుకొస్తుండగా.. వరంగల్‌-నర్సంపేట ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మేనమామతో పాటు ఇద్దరు మేనకోడళ్లు సాత్విక, జాహ్నవి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.