రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సాంబమూర్తి రిజర్వాయరు వద్ద జరిగిన ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కాకినాడ రామశ్వరం గ్రామానికి చెందిన 15 మంది పెద్దాపురం మండలం వడ్డమూరులోని బంధువుల పెళ్లికి హాజరై ఆటోలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం సాంబమూర్తి రిజర్వాయర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పెంకె రాజు(50), సాలాది నాగమణి(35), నొక్కు కమలమ్మ(35), పండు(3)లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకుకున్నారు.