సాగర్‌ హైవేపై ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి

సాగర్‌ హైవేపై ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి

హైదరాబాద్ - నాగార్జున సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో15 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వస్తున్న బొలెరో వాహనం.. కొండమల్లెపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే సాగర్ హైవేపై టైర్ పగిలిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది... ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ఏడుగురు చనిపోయారు.. బస్సులోఉన్న 15 మందికి గాయాలయ్యాయి... దేవరకొండ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులంతా శేరిపల్లి గ్రామపంచాయతీకి చెందినవారిగా గుర్తించారు.