ఎక్స్‌గ్రేషియా కోసం రోడ్డెక్కిన బాధితులు..

ఎక్స్‌గ్రేషియా కోసం రోడ్డెక్కిన బాధితులు..

గద్వాల్ జిల్లా రామాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మరోవైపు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలంటూ ధర్నా చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా.. వారు ఆందోళన విరమించడానికి నిరాకరించారు. ఆందోళన చేస్తున్న బాధితులకు మందకృష్ణ మాదిగతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్. మృత దేహాలను రోడ్డు పైనే ఉంచి ఆందోళనకు దిగారు. కాగా, కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరంతో గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారు.