అర్ధరాత్రి ఏటీఎంలో ఇలా..!

అర్ధరాత్రి ఏటీఎంలో ఇలా..!

అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు దుండగులు... దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురారం కాలనీ బస్టాప్ దగ్గర ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు... చోరీకి  యత్నించారు. ఏటీఎం మిషన్ ధ్వంసం చేసి తెరిచేందుకు ప్రయత్నం చేయగా... ఆ మిషన్లు తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు ఏటీఎంలలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.