యస్వంత్ పురా ఎక్స్ ప్రెస్ లో దారి దోపిడి

యస్వంత్ పురా ఎక్స్ ప్రెస్ లో దారి దోపిడి

యస్వంత్ పురా ఎక్స్ ప్రెస్ రైల్లో దారి దోపిడీ జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత దివిటిపల్లి వద్ద సిగ్నల్ కట్ చేయడంతో రైలు ఆగిపోయింది. వెంటనే రాళ్లతో దాడి చేయడంతో ప్రయాణికులు ఎం జరుగుతుందో తెలుసుకునేందుకు కిటికి తలుపులు తెరవడంతో అందిన కాడికి దోచుకున్నారు. మహిళల మెడలోని 24 తులాల బంగారం, 4 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడికి తెగబడ్డారు. ఆభరణాలను లాక్కెళ్తున్న సమయంలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ప్రయాణికులు కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణికుల భద్రత లేదని పలువురు మీడియా ముందు వాపోయారు.

యశ్వంత్ పురా ఎక్స్ ప్రెస్ దారిదోపిడిపై విచారణ ప్రారంభించారు అధికారులు. ఈ ఘటన పై రైల్వే ఎస్పీ నుంచి డీజీపీ మహేందర్ వివరాలు తెలుసుకున్నారు. పార్థీ ముఠాకు చెందిన పాత నేరస్తులే దోపిడీ కి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తు ముమ్మరం చేశామని త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.