రాబర్ట్ వాద్రా బెయిల్ రద్దు చేయండి: ఈడీ

రాబర్ట్ వాద్రా బెయిల్ రద్దు చేయండి: ఈడీ

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేవు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో గాంధీ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాబర్ట్ వాద్రాపై పట్టు బిగించడం ప్రారంభించింది. వార్తాకథనాల ప్రకారం ఈడీ మనీ లాండరింగ్ కేసులో వాద్రా బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్ట్ తలుపు తట్టింది. ఇటీవలే ఒక ట్రయల్ కోర్టు ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. 

రాబర్ట్ వాద్రా తనకు పలు షరతులతో కూడిన యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి పోరాదని ఏప్రిల్ 1న బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ అయిన వాద్రా, లండన్ లోని 12, బ్రాయంటన్ స్క్వేర్ లో 19 లక్షల పౌండ్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేయడంపై మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.