ఈడీ అధికారుల ఫిట్ నెస్ పై రాబర్ట్ వాద్రా వెటకారం

ఈడీ అధికారుల ఫిట్ నెస్ పై రాబర్ట్ వాద్రా వెటకారం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెటకారం చేశారు. ఆయన ఈడీని ‘ఔట్ ఆఫ్ షేప్‘ అని ఎద్దేవా చేశారు. కొద్ది రోజులుగా గంటల కొద్దీ ఈడీ ప్రశ్నల పరంపరను ఎదుర్కొంటున్న వాద్రా, తనను విచారిస్తున్న అధికారుల ఫిట్ నెస్ గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ వారికి కొన్ని ఆరోగ్య సూత్రాలు తన ట్విట్టర్ పోస్టులో సూచించారు.

గురువారం ఉదయం తన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో పెట్టిన పోస్టులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రా, ‘మీపై మీకు నమ్మకం, పట్టుదల ఉన్నపుడు ఏ వాతావరణంలో ఉన్నప్పటికీ మీ శక్తిని మార్పిడి చేసుకోవడం అనేది ఒక నేర్చుకొనే, నేర్పించే ప్రక్రియ. ఏజెన్సీకి కూడా కొంత స్టైల్, ఆరోగ్య సూత్రాలు ఇవి‘ అని పేర్కొన్నారు.

నిన్న వాద్రాని ఈడీ మూడున్నర గంటలు విచారించింది. ఈడీ జామ్ నగర్ కార్యాలయంలో వాద్రా తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. ఆయనను శుక్రవారం మరోసారి హాజరు కావాల్సిందిగా ఈడీ సూచించింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను ప్రశ్నిస్తోంది. గత వారం బికనేర్ కి పిలిచి వాద్రాను ఈడీ ప్రశ్నించింది. సుఖ్ దేవ్ విహార్ లోని ఒక ఆస్తిని ఈడీ జప్తు చేసింది. ఈ ప్రాపర్టీ వాద్రాకి చెందిన కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిట ఉంది.