రాబర్ట్ వాద్రా బెయిల్ పొడిగింపు..

రాబర్ట్ వాద్రా బెయిల్ పొడిగింపు..

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ముందస్తు బెయిల్ ను మార్చి 25వరకూ పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. లండన్ లో స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. దాని గడువు మంగళవారంతో ముగిసింది. మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ ను మార్చి 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో రెండు ఇళ్ల కొనుగోలులోనూ రాబార్డ్ వాద్రా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. దానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడానికి తమకు అనుమతివ్వాలని ఈడీ కోర్టుకు విన్నవించింది.