ధోని కెప్టెన్సీ కంటే గంభీర్ కెప్టెన్సీ బెస్ట్ : ఊతప్ప

ధోని కెప్టెన్సీ కంటే గంభీర్ కెప్టెన్సీ బెస్ట్ : ఊతప్ప

భారత ఓపెనర్ రాబిన్ ఊతప్ప గురించి అందరికి తెలుసు. అయితే ఊతప్ప కోల్‌కత నైట్ రైడర్స్ ఓపెనర్ గా ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఐపీఎల్ లో ఊతప్ప కు అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఊతప్ప చివరిసారిగా 2015 లో భారత్ తరుపున ఆడాడు. ఇప్పుడు ఈ ఆటగాడు తిరిగి మళ్ళీ భారత తుది జట్టులోకి రావాలి అని అనుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ  లో మాట్లాడిన ఊతప్ప 2020 లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో తనకి ఆడాలని ఉందని వెల్లడించాడు. అయితే ఊతప్ప భారత జట్టు లో  రాహుల్ ద్రవిడ్, మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ లో ఆడాడు అలాగే ఐపీఎల్ లో గంభీర్ కెప్టెన్సీ లో ఆడాడు. అయితే ఈ ముగ్గురిలో మీకు ఫేవరెట్ కెప్టెన్ ఎవరు..? అని ప్రశ్నించగా ఊతప్ప గంభీర్ అని సమాధానం ఇచ్చాడు. ఇంకా ‘‘గౌతమ్ గంభీర్ నా ఫేవరెట్ కెప్టెన్. గ్రౌండ్ లో అతను ఎక్కువగా మాట్లాడడు. కానీ.. ఎవరికి.. ఎంత చెప్పాలో అంతే చెప్తాడు. గంభీర్‌ లాంటి మంచి కెప్టెన్ ఉంటే..? టీం అంత ధైర్యంగా ఉండవచ్చు. అలాగే ఐపీఎల్‌లో గంభీర్ కెప్టెన్సీలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మన అందరికి తెలుసు. అతని కెప్టెన్సీ లో  కోల్‌కత నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది’’ అని రాబిన్ ఊతప్ప తెలిపాడు.