విజువల్ వండర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్

విజువల్ వండర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్

అరవింద సమేత రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాక మరలా సినిమా ఇండస్ట్రీ కళకళలాడటం మొదలు పెట్టింది.  అక్టోబర్ లో తెలుగులో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే.  దీనితరువాత పెద్ద హీరోల సినిమాలు లేవు.  నవంబర్ లో తమిళ, హిందీ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి.  ఇలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మొదటి సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.  అమితాబ్, అమీర్ ఖాన్ లు నటిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.  విజువల్ వండర్స్ గా సినిమాను తెరకెక్కించారు.  

తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు యశ్ రాజ్ సంస్థ కృషి చేస్తున్నది.  మరోవైపు నవంబర్ 29 న భారత దేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రోబో 2 పాయింట్ ఓ సినిమా రిలీజ్ కాబోతున్నది.  గ్రాఫిక్ వండర్ గా వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.  రోబో కు ఇది అప్ గ్రేడ్ వర్షన్.  రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ కీలక పాత్ర పోషిస్తున్నది.  

ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 49 రోజుల గడువు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు ఓ రకమైన టెన్షన్ మొదలైంది.  గతంలో శంకర్ సినిమాలకు సుజాత రంగరాజన్ అనే ప్రొఫెసర్ కథలు అందించేవారు.  అయన అందించిన కథనాల ఆధారంగా సినిమాలు తెరకెక్కేవి.  వీరి కాబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి.  ఇప్పుడు ఆయన లేరు.  అయన స్థానంలో జయ మోహన్ వచ్చారు.  ఈయన అందించిన కథ ఆధారంగానే రోబో 2 పాయింట్ ఓ ను తెరకెక్కించారు.  ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరిలో ఒకరకమైన ఉత్కంఠత మొదలైంది.  ఈ ఉత్కంఠతకు తెరపడాలి అంటే మరో 49 రోజులు ఆగాల్సిందే.