చైనీలకు ఈ చిట్టి నచ్చుతాడా..?

చైనీలకు ఈ చిట్టి నచ్చుతాడా..?

రజినీకాంత్ హీరోగా రోబో కు కొనసాగింపుగా వచ్చిన రోబో 2 సినిమా ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఇప్పుడు ఈ చిట్టి రోబో కన్ను డ్రాగన్ దేశం చైనాపై పడింది.  చైనా భాషలో అనువదించి జూన్ 12 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  

దాదాపు 5600 స్క్రీన్ లో సినిమా అక్కడ రిలీజ్ కాబోతున్నది.  హాలీవుడ్ తరువాత చైనా మార్కెట్ అతిపెట్టది.  హాలీవుడ్ సినిమాలు చైనాలో కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.  ఎవెంజర్స్ సినిమా చైనాలో రూ. 4163 కోట్లు వసూలు చేసింది.  అమీర్ ఖాన్ దంగల్ సినిమా రూ. 1983 కోట్లు వసూలు చేయడం విశేషం.  మరి ఈ చిట్టి రోబో ఎంత వసూళ్లు చేస్తుందో చూడాలి.