రోబో చేసిన బొమ్మలు ఇవే..

రోబో చేసిన బొమ్మలు ఇవే..

మనుషులు చేసే పనులు రోబోలు చేస్తున్నాయి. మరి మనిషిలాగే ఆలోచించే మనసు రోబోలకు ఉంటుందా? ఒకవేళ ఉంటే బొమ్మలు కూడా వేయగలవా? ఈ ఆలోచనే ఫ్రాన్స్ లోని హ్యూగో కేసెలెస్ డుప్రే అనే ఓ కంప్యూటర్ ఇంజినీర్ కు కలిగింది. ఆలోచన రావడమే ఆలస్యం.. తన బాల్య స్నేహితులతో కలిసి ప్రాజెక్టు మొదలుపెట్టాడు. ఇందుకోసం వారు కంప్యూటర్ ఆల్గారిథమ్ ని క్రియేట్ చేశారు. ఇంతకుముందున్న ఇమేజెస్ ను ఈ సాఫ్ట్ వేర్ కు ఫీడ్ చేస్తే.. అది మరో కొత్తరకమైన బొమ్మల్ని క్రియేట్ చేస్తుంది. 

ప్రయోగపూర్వకంగా పాత తరానికి చెందిన ప్రఖ్యాత పెయింటర్ రెంబ్రాంట్ వేసిన పెయింటింగ్స్ ను ఆల్గారిథమ్ కు ఇచ్చారు. దీంతో అది అలాంటి పెయింటింగ్స్ నే పోలిన కొత్త బొమ్మల్ని క్రియేట్ చేసింది. అయితే రెంబ్రాంట్ ఫ్యాన్స్ సంతృప్తి చెందే రేంజ్ లో మాత్రం తాజా బెల్లామీ పెయింటింగ్స్ లేవు. అయితే తమ ప్రయత్నం సఫలమైందని, దీన్ని మరింతగా డెవలప్ చేస్తే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిజల్ట్ అనుకున్నంతగా రాకపోవచ్చు గానీ.. రోబోలు కూడా పెయింటింగ్స్ వేయగలవు అనే థీమ్ మాత్రం వర్కవుట్ అయింది. రెంబ్రాంట్ వేసిన పెయింటింగ్స్ కు చాలా దగ్గరి పోలికలతో ఉన్న పెయింటింగ్స్ ను వారు న్యూయార్క్ లో వేలం వేయాలని నిర్ణయించారు. తమ రోబో వేసిన పెయింటింగ్స్ 7 వేల డాలర్ల నుంచి 10 వేల డాలర్లు పలకవచ్చని భావిస్తున్నారు. 

జెనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్ వర్క్ (జీఏఎన్) ఆధ్వర్యంలో ఈ సరికొత్త ఆల్గారిథమ్ తయారై బెలామీ పిక్చర్స్ గా వేలం వేస్తున్నారు. ఇందుకోసం రెంబ్రాంట్ వేసిన 15 వేల ఇమేజెస్ వాడారు. అయితే ఈ ఆల్గారిథమ్ ను ప్యారిస్ కు చెందిన ఓ ఔత్సాహికుడు 10 వేల డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం.