రోబోలను ఇలా కూడా వాడతారా?
రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో రోబోల వాడకం పెరిగింది. వివిధ రంగాల్లో రోబోలను వినియోగిస్తున్నారు. అత్యంత సున్నితమైన, అత్యంత క్లిష్టమైన పనులను రోబోల సహాయంతో చేస్తున్నారు. పూర్వకాలంలో ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడానికి రిక్షాలు అందుబాటులో ఉండేవి. వాటిని మనుషులు లాగుతుండేవారు. ఆ తరువాత ఎద్దుల బండ్లు, గుర్రం బండ్లు కార్లు బైకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, రాబోయే రోజుల్లో రోబోలతో తయారు చేసిన రిక్షాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ డిజైనర్ ఆడమ్ సావేజ్ డాగ్ రోబోతో ఓ రిక్షాను తయారు చేసుకున్నాడు. డాగ్ రోబోకు కొంతమేర ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనుసంధానమయ్యి ఉండటంతో ప్రయాణం చేసే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు కదులుతోంది. అంతేకాదు, సావేజ్ అడిగిన ప్రశ్నలకు డాగ్ రోబో స్పాట్ సమాధానం చెప్తున్నది. దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)