జొకోవిచ్‌, ఫెడరర్‌ ముందంజ

జొకోవిచ్‌, ఫెడరర్‌ ముందంజ

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ స్టార్ ఫెడరర్‌, సెర్బియా స్టార్‌ నోవాక్‌ జొకోవిచ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు. ఫెడరర్‌ 6–2, 6–2, 6–4తో జపాన్‌కు చెందిన యోషిహితో నిషిఒకాపై జయకేతనం ఎగురవేసి రెండవ రౌండ్ కు దూసుకెళ్లాడు. నోవాక్‌ జొకోవిచ్‌  6–3, 3–6, 6–4, 6–0తో హంగేరికి చెందిన మార్టన్‌ ఫుక్సోవిక్స్‌పై విజయం సాధించాడు. సిలిచ్‌(క్రొయేషియా) 7–5, 6–1, 1–1తో మారియస్‌ కొపిల్‌(రొమేనియా) గెలుపొందాడు. మారియస్‌ కొపిల్‌ ఆట మధ్యలో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో వోజ్నియాకి (డెన్మార్క్‌) 6–3, 6–2తో స్టోసుర్‌(ఆస్ట్రేలియా)పై.. కెర్బర్‌(జర్మనీ) 7–6 (7/5), 6–3తో గాస్పర్యాన్‌(రష్యా)పై విజయం సాధించారు.