వైరల్ వీడియో: ఫెడరర్ కి స్టేడియంలో నో ఎంట్రీ

వైరల్ వీడియో: ఫెడరర్ కి స్టేడియంలో నో ఎంట్రీ

టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడైన స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతనిని అందరూ గుర్తు పడతారు. పురుషుల టెన్నిస్ లో అత్యంత విజయవంతమైన లెజెండరీ ఆటగాడు ఫెడరర్ కి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గుర్తింపు కార్డు లేకుండా స్టేడియంలోకి వెళ్లబోయిన ఫెడెక్స్ ని అక్కడి సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రోజర్ కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ ని గౌరవిస్తూ అక్కడే ఆగిపోయాడు.

ఈ ఘటన జరిగిన కాసేపటికి ఫెడరర్ శిక్షణ బృందంలోని ఒక సభ్యుడు గుర్తింపు కార్డుతో అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఫెడెక్స్ ని లోపలికి అనుమతించారు. సెక్యూరిటీ గార్డ్ ఫెడరర్ ని అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సెక్యూరిటీగార్డు, ఫెడరర్ ఇద్దరూ పరస్పరం ప్రవర్తించిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.