వింబుల్డన్ః ఫెదరర్ ఓటమి
తొమ్మిదోసారి వింబుల్డన్ ఓపెన్ గెల్చుకోవాలన్న రోజర్ ఫెదరర్ ఆశలు ఇవాళ గల్లంతయ్యాయి. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ ఆండర్సన్ చేతిలో ఫెదరర్ ఓడిపోయాడు. తొలి రెండు సెట్లు గెలిచినా తరవాత జరిగిన మూడు సెట్లలో (2-6, 6-7 (5/7), 7-5, 6-4, 13-11) ఓడిపోయాడు. నాలుగు గంటల 13 నిమిషాలపాటు జరిగిన హోరాహోరిగా సాగిన ఈ పోరులో విజయం ఆండర్సన్ను వరించింది. ఎనిమిదో సీడ్ అయిన అండర్సన్ శుక్రవారం జరిగే సెమిఫైనల్లో మిలోస్ రావోనిక్ లేదా జాన్ ఐస్నర్తో తలపడుతాడు. ఆదివారం ఫైనల్ జరగనుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)