హాప్‌మన్‌ కప్‌ ఫెడరర్‌ జట్టుదే

హాప్‌మన్‌ కప్‌ ఫెడరర్‌ జట్టుదే

అంతర్జాతీయ మిక్స్‌డ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ హాప్‌మన్‌ కప్‌ను రోజర్‌ ఫెడరర్‌ జట్టు గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోజర్‌ ఫెడరర్‌–బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) జట్టు అలెగ్జాండర్‌  జ్వెరెవ్‌–ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) జట్టుపై 2–1తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–4, 6–2తో జ్వెరెవ్‌ (జర్మనీ)ను ఓడించడంతో స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యం దక్కింది. రెండో మ్యాచ్‌లో కెర్బర్‌ (జర్మనీ) 6–4, 7–6 (8/6)తో బెన్సిచ్‌పై (స్విట్జర్లాండ్‌) విజయం సాధించడంతో స్కోరు 1–1తో సమం అయింది. ఇక నిర్ణాయక మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌–బెన్సిచ్‌ జోడీ 4–0, 1–4, 4–3  (5/4)తో జ్వెరెవ్‌–కెర్బర్‌ జంటను ఓడించి టైటిల్ నెగ్గింది.