ఫెడరర్‌ @ 100

ఫెడరర్‌ @ 100

స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్ రోజర్‌ ఫెడరర్‌ కెరీర్‌లో వందో సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. శనివారం దుబాయ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్ నెగ్గడంతో ఫెడరర్‌ కెరీర్‌లో వందో సింగిల్స్‌ టైటిల్‌ చేరింది. దీంతో అమెరికా టెన్నిస్‌ ఆటగాడు జిమ్మీ కానర్స్‌ (109 టైటిల్స్‌) తర్వాత సెంచరీ టైటిల్ మార్క్ అందుకున్న రెండో ఆటగాడిగా ఫెడరర్‌ నిలిచాడు. దుబాయ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 6–4తో గ్రీస్‌ యువ కెరటం సిట్సిపాస్‌ను ఓడించాడు. దీంతో ఫెడరర్‌ ఈ టైటిల్‌ను 8వ సారి సొంతం చేసుకున్నాడు. 

రోజర్‌ ఫెడరర్‌ ఖాతాలోని 100 టైటిల్స్‌:

# 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌
# 6 ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్స్‌
# 27 ఏటీపీ వరల్డ్‌ టూర్‌ మాస్టర్స్‌–1000 టైటిల్స్‌
# 22 ఏటీపీ వరల్డ్‌ టూర్‌–500 టైటిల్స్‌
# 25 ఏటీపీ వరల్డ్‌ టూర్‌–250 టైటిల్స్‌