హైదరాబాద్ లో రోహింగ్యలకు జీహెచ్‌ఎంసీ అండ...

హైదరాబాద్ లో రోహింగ్యలకు జీహెచ్‌ఎంసీ అండ...

హైదరాబాద్ లో రోహింగ్యలకు జీహెచ్‌ఎంసీ అండ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ జోన్ లో ఇష్టానుసారంగా జీహెచ్‌ఎంసీ రొహింగ్యలకు సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పత్రాల ద్వారా ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ లను పొందుతన్నారు రోహింగ్యలు. సౌత్ జోన్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ 6 లో పలువురు మీ సేవ వారితో కుమ్మకు అయ్యారు. శరణార్థులు గా వచ్చిన రోహింగ్యలకు ఇష్టం వచ్చినట్టు పత్రాలు జారీ చేస్తున్నారు. వారు ఇక్కడి స్కూల్ లో చదివినట్టు దరఖాస్తు పెట్టుకోగానే పత్రాలు జారీ చేస్తుంది బల్దియా... గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు పలువురు సిబ్బంది. ఇప్పటికే రోహింగ్యల పై కేంద్ర హోం శాఖ దృష్టి సారించగా... పలు కేసులో దర్యాప్తు చేసింది ఎన్ఐఎ. అయినా పలువురు సౌత్ జోన్ బల్దియా సిబ్బంది తమ తీరు మార్చుకోవడం లేదు.