తిరుమలలో రోహిత్ శర్మ, దినేష్‌ కార్తీక్‌

తిరుమలలో రోహిత్ శర్మ,  దినేష్‌ కార్తీక్‌

టీమిండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌లు తిరుమల విచ్చేశారు. ఇవాళ తెల్లవారుజామున స్వామివారిని కార్తీక్‌ దర్శించుకోగా.. 7 గంటల సమయంలో రోహిత్‌శర్మ స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు రోహిత్‌శర్మ, దినేష్‌కార్తీక్‌లకు ఘన స్వాగతం పలికారు. రోహిత్‌శర్మతోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా తిరుమల వచ్చారు.
రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌లు  తరచుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా రోహిత్‌ శర్మ.. వెంకన్నను దర్శించుకున్నాడు.