ఈ విజయం అందరిది..

ఈ విజయం అందరిది..

ఐపీఎల్‌లో నాల్గోసారి టైటిల్‌ గెలిచి రికార్డు సృష్టించింది ముంబై ఇండియన్స్ జట్టు... ఈ విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... ఈ విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారని ప్రశంసించారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశారన్న రోహిత్... 20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యతో వేయిద్దాం అనుకున్నాం. కానీ, గతంలో ఈ స్థితిలో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న మలింగ వైపే మళ్లామని తన వ్యూహాలను చెప్పుకొచ్చారు. కాగా, చివరి ఓవర్‌లో చెన్నై 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు మలింగ. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రెండో పరుగు కోసం వెనక్కి వచ్చిన వాట్సన్‌ రనౌటయ్యాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్‌ ముంబై వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2 తీసిన శార్దూల్‌ చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ముంబై విజయం సాధించింది.