ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ : రోహిత్ శర్మ పైపైకి !

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ : రోహిత్ శర్మ పైపైకి !

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు తమ స్థానాలు మెరుగు పర్చుకున్నారు. ఓపెనర్ గా సత్తా చాటిన రోహిత్ శర్మ 17వ స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మతో పాటు వైజాగ్ టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25వ స్థానంలో నిలిచాడు. కెరీర్‌లో ఐదో టెస్టు మ్యాచ్ ఆడిన మయాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల రూపంలో డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. దీంతో అతను ర్యాంకింగ్స్‌లో ఏకంగా 38 స్థానాలు పైకి ఎగబాకాడు. అలా మయాంక్ అగర్వాల్ 25వ స్థానానికి వెళ్లాడు.

ఇక వైజాగ్ టెస్టులో నిరాశపరిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 899 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టాడు. గత ఏడాది జనవరి తర్వాత విరాట్ కోహ్లీ 900 పాయింట్లకి దిగువన పడిపోవడం ఇదే తొలిసారి. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 937 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ పదో స్థానంలో, షమీ పద్నాలుగో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్ లో జడేజా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్‌  తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్‌పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది.