ఒక్క మ్యాచ్ తో ధోని, విరాట్ లను దాటేసిన రోహిత్ 

ఒక్క మ్యాచ్ తో ధోని, విరాట్ లను దాటేసిన రోహిత్ 

ఇండియా.. బంగ్లాదేశ్ జట్లమధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టి 20 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నది.  ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే.  కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.  విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు.  ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ రెండు రికార్డులు నెలకొల్పాడు.  అందులో ఒకటి ధోని రికార్డు.  ఇండియాలో అత్యధిక టి 20 క్రికెట్ ఆడిన ఆటగాడిగా ధోని టాప్ ప్లేస్ లో ఉన్నాడు.  ఈ రికార్డును రోహిత్ చెరిపేశాడు.  ధోని 98 టి 20 మ్యాచ్ లు ఆడితే.. రోహిత్ 99 మ్యాచ్ లు ఆడాడు.  వరల్డ్ అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా షోయబ్ మాలిక్ (111) ఉండగా, రెండో స్థానంలో షాహిద్ ఆఫ్రిది (99) ఉన్నాడు.  

ఇక ట్ 20 క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరు ఉండేది.  కోహ్లీ టి 20 క్రికెట్ లో 2450 పరుగులు చేయగా, ఈ రికార్డును రోహిత్ శర్మ ఈ మ్యాచ్ తో అధికమించాడు.