టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

కోల్ కత్తా ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్‌ గెలిచి ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగు పర్చుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. జేసన్ రాయ్ స్థానంలో బరిందర్ స్రాన్ జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా తమ జట్టులో మూడు మార్పులు చేసింది. బ్రాత్‌వైట్, ప్రశిద్ధ్ కృష్ణ, పృథ్వీరాజ్‌ల స్థానంలో హ్యారీ గర్నే, రాబిన్ ఊతప్ప, సందీప్ వారియర్ జట్టులోకి వచ్చారు.