హిట్ మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు..!

హిట్ మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు..!

హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. 137 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు హిట్‌మ్యాన్‌. అతడి తర్వాతి స్థానంలో ఉన్న హషీమ్‌ ఆమ్లా 147 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల రన్స్ సాధించగా.. సచిన్‌ 160 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ సాధించాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 168 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. వీరితో పాటు శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ 165 ఇన్నింగ్స్‌లతో ఈ రికార్డ్‌లో ఉన్నాడు. కానీ.. తాజాగా ఈ అందరి రికార్డ్స్‌ని రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 44 బంతుల్లో 42 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.