విమర్శల పై స్పందించిన రోహిత్ శర్మ...

విమర్శల పై స్పందించిన రోహిత్ శర్మ...

నాలుగో టెస్టులో రోహిత్ ఆట తీరుపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పూర్తి బాధ్యరాహిత్యంగా ఆడాడని మండిపడ్డారు. ఫీల్డర్లను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ చేయాలన్న కనీస ఆలోచన కూడా లేదన్నాడు. లాంగాన్‌లో, స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నప్పుడు...అలాంటి షాట్‌ ఆడాలని ఎలా అనుకుంటావంటూ రోహిత్‌ ఆట తీరును విమర్శించారు. అంతకుముందు లియాన్ బౌలింగ్‌లో చక్కటి ఫోర్లు కొట్టిన రోహిత్‌.. అసలు ఆ షాట్ ఎందుకు ఆడాడో కూడా అర్థం కావడం లేదని గవస్కర్‌ చెప్పుకొచ్చాడు. హిట్‌మ్యాన్‌ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడం విస్మయానికి గురిచేసిందని మాజీ ఆటగాళ్లు విమర్శించారు. అది బాధ్యతారాహిత్యమైన షాట్‌ అని విశ్లేషించారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ బదులిచ్చాడు. ఆ షాట్‌ ఆడినందుకు పశ్చాత్తాపం లేదని అన్నాడు. గతంలో అదే టెక్నిక్‌తో విజయవంతంగా బౌండరీలు సాధించానని గుర్తుచేశాడు.